ఢిల్లీలోని నా ఇంటిపై రాళ్ల దాడి జరిగింది: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
- ఢిల్లీలోని అసద్ ఇంటిపై నిన్న రాళ్లదాడి
- ఒక ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితేమిటని ప్రశ్న
- బీజేపీ నేత ఇంటిపై జరిగితే ఇలాగే ఉండేవారా? అన్న అసద్
అగస్ట్ 13న సాయంత్రం అసద్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపుల అద్దాలను ధ్వంసం చేశారు. కాగా, దాడికి సంబంధించి అసద్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ పగిలిన అద్దాల చుట్టూ ఎలాంటి రాయి లేదా ఇతర వస్తువులు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే ఇంటిపై దాడి జరిగింది.