తెలంగాణ టీడీపీ బస్సు యాత్రలో చంద్రబాబు కూడా పాల్గొంటారు: కాసాని జ్ఞానేశ్వర్
- తెలంగాణలో పుంజుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు
- ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర
- జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర
- ఆపై జిల్లాల్లోనూ యాత్ర
తాజా కార్యాచరణపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వివరాలు తెలిపారు. ఈ నెల 23 నుంచి టీటీడీపీ బస్సు యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ బస్సు యాత్రలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం నుంచి యాత్రను ప్రారంభిస్తామని వివరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని కాసాని పేర్కొన్నారు. అనంతరం, జిల్లాల్లో బస్సు యాత్ర చేపడతామని వెల్లడించారు.