ప్రస్తుతం మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉంది: ప్రకాశ్ రాజ్
- మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని విమర్శ
- జోకర్ను నాయకుడిగా చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమేనని వ్యాఖ్య
- మౌనంగా ఉంటే దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయని హెచ్చరిక
సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ తాను ఊరికే కూర్చోలేనన్నారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం రచయితలందరూ సంఘటితమైనదే ఈ సమూహ ఫోరమ్ అన్నారు. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలందరి ఉమ్మడి స్వరమన్నారు. సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక ఇది అన్నారు.