పేదలకు కేసీఆర్ ఇళ్లు కడితే.. కేంద్రం వాటాను తీసుకు వచ్చే బాధ్యత నాదే!: కిషన్ రెడ్డి
- 4 నెలల్లో ప్రగతి భవన్, 8 నెలల్లో సచివాలయం కట్టుకున్నారన్న కిషన్ రెడ్డి
- పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూం విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శ
- కేసీఆర్ పాలనలో పేపర్లపై ఉండే ఇళ్లు భూమ్మీద ఉండవని ఎద్దేవా
పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని 2017లో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు కడితే కేంద్రం వాటాను తీసుకు వచ్చే బాధ్యత తనదేనని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నేతలు దోచుకుతింటున్నారని ఆరోపించారు. దళితబంధు పేరుతో దళితులను, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పటికీ ఇళ్లు రావన్నారు. ఎన్నికలు ఉన్నందున గృహలక్ష్మి పేరుతో కేసీఆర్ గారడీ చేస్తున్నారన్నారు.