vasupalli gansh kumar: ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా

  • దాడి కేసులో వాసుపల్లి గణేశ్ సహా ఇద్దరికి జిల్లా సెషన్స్ కోర్టు శిక్ష
  • రామచంద్రారెడ్డి, దుర్గారెడ్డిల మధ్య 2006 నుండి ఆస్తుల వివాదం కేసు
  • 2008లో దుర్గారెడ్డితో కలిసి రామచంద్రారెడ్డిపై వాసుపల్లి గణేశ్ దాడి
  • నేరం రుజువు కావడంతో ఇద్దరికీ శిక్ష, జరిమానా విధించిన కోర్టు
Six months imprisonment for MLA Vasupalli Ganesh

దాడి కేసులో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కు జైలుశిక్ష విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. విశాఖకు చెందిన బోర రామచంద్రారెడ్డి, దుర్గారెడ్డిల మధ్య ఆస్తుల వివాదానికి సంబంధించి 2006 నుండి కేసు నడుస్తోంది. ఈ క్రమంలో 2008లో వాసుపల్లి గణేశ్, దుర్గారెడ్డి కలిసి రామచంద్రారెడ్డిపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామచంద్రారెడ్డి వీరిద్దరిపై కేసు పెట్టారు. ఇప్పుడు నేరం రుజువు కావడంతో వాసుపల్లి గణేశ్, దుర్గారెడ్డిలకు.. ఇద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

More Telugu News