సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్
- బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రం
- అమెజాన్ ప్రైమ్ లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్
తాజాగా ఈ చిత్రం నిశ్శబ్దంగా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' లో నిన్న అర్ధరాత్రి నుంచి ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఇది అందుబాటులో ఉంది. ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే ఈ సినిమాను చూడొచ్చు. దక్షిణాది భాషల్లో సినిమా అమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆదిపురుష్ హిందీ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.