అరవింద్ నోటికి అదుపులేకుండా పోతోంది... ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడే పోటీ చేస్తా: కవిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరవింద్ నోటికి అదుపులేకుండా పోతోంది... ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడే పోటీ చేస్తా: కవిత

Kavitha says she will defeat MP Dharmapuri Arvind in next election
  • పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని అరవింద్‌కు సూచన
  • తన కట్టె కాలే వరకు నిజామాబాద్‌లోనే ఉంటానన్న కవిత
  • బండి సంజయ్ తెలంగాణ హక్కుల కోసం ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శ
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు పలికారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అరవింద్ నోటికి అదుపులేకుండా పోతోందని, దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. టిక్కెట్ ఇస్తానని సొంత పార్టీల నేతల దగ్గర డబ్బులు వసూలు చేస్తారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా నిజామాబాద్‌లో పోటీ చేస్తానన్నారు. అరవింద్ కోరుట్లకు వెళ్తాడని ప్రచారం సాగుతోందని, కానీ ఆయన ఎక్కడకు వెళ్తే తాను అక్కడకు వెళ్లి ఓడిస్తానన్నారు. తనది నిజామాబాద్ అని, తన కట్టె కాలే వరకు అక్కడే ఉంటానన్నారు.

కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ కరెంట్ తీగలు పట్టుకుంటే కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందన్నారు. తెలంగాణ హక్కుల కోసం బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు‌లో ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ గెలుపు శూన్యమన్నారు. అన్ని స్థానాలను తామే గెలుస్తామన్నారు. నిజామాబాద్‌కు ఐటీ పరిశ్రమను తీసుకుని వచ్చామని, స్వాతంత్య్రం వచ్చాక ఇన్ని నిధులు మంజూరు చేసిన ఘనత తమ పార్టీదే అన్నారు.
Advertisement
K Kavitha
dharmapuri arvind
BJP
BRS

More Telugu News