స్టార్ క్రికెటర్ జడేజాకు ఐదు నెలల్లో మూడుసార్లు డోప్ పరీక్ష
- భారత క్రికెటర్లందరిలో అతని నుంచే ఎక్కువ శాంపిల్స్ సేకరించిన నాడా
- ఈ సమయంలో రోహిత్, కోహ్లీ శాంపిల్స్ తీసుకోని వైనం
- ఐదు నెలల్లో మొత్తంగా 55 నమూనాల సేకరణ
ఏప్రిల్‌లో హార్దిక్ పాండ్యా యూరిన్ శాంపిల్‌ను సేకరించి పరీక్షించారు. నాడా 2021, 2022లో భారత క్రికెటర్ల నుంచి వరుసగా 54, 60 నమూనాలను సేకరించింది. అయితే, ఈ ఏడాది వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మే వరకే ఏకంగా 55 నమూనాలను సేకరించడం గమనార్హం. అయితే, ఇందులో ఒక్కటి కూడా డోప్ పరీక్షలో పట్టుబడలేదు. ఈ ఏడాది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఒక్కోసారి డోప్ పరీక్షకు హాజరయ్యారు.