ప్రాంతాలు, కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: జక్కంపూడి రాజా
- చంద్రబాబు రోడ్ షో ఫ్లాప్ అన్న జక్కంపూడి
- బాబు సభల్లో జెండాలు ఫుల్, జనాలు నిల్ అని ఎద్దేవా
- రాష్ట్రం ముక్కలు కావడానికి చంద్రబాబే కారణమని విమర్శ
చంద్రబాబు చేసిన తప్పులు, హైకోర్టు ఆదేశాల వల్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని రాజా తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే 2014 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. తాను రూ. 700 కోట్లు దోచేశానని టీడీపీకి సంబంధించిన పత్రికలో ఆరోపణలు చేయడం సరికాదని... తనకు రూ. 70 కోట్లు ఇస్తే తన ఆస్తులన్నింటినీ రాసిచ్చేస్తానని అన్నారు.