నేడు విజయవాడలో 'వ్యూహం' షూటింగ్.. పాల్గొనేందుకు రావాలంటూ ఆర్జీవీ పిలుపు
- ఏపీ తాజా, మాజీ ముఖ్యమంత్రులను పోలిన పాత్రలతో రూపొందుతున్న సినిమా
- నిర్మాతగా దాసరి కిరణ్ కుమార్
- వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశం
ఈ రోజు విజయవాడలోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్లో వ్యూహం చిత్రం కోసం ప్రేక్షకుల సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇందుకు థ్రిల్లింగ్ గా ఉందన్నారు. చిత్రీకరణలో పాల్గొనేవారిని ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. వ్యూహం చిత్రాన్ని దాసరి కిరణ కుమార్ నిర్మిస్తున్నారు. కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అనేది ట్యాగ్ లైన్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమాను విడుదల చేయాలని ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.