Pushpa2: ‘పుష్ప2’ నుంచి షెకావత్ లుక్ రిలీజ్.. ప్రతీకారంతో వస్తున్నాడట!

pushpa 2 movie fahadh faasil look released
షార్ట్స్‌లో చూడండి
‘పార్టీ లేదా పుష్ప’ అంటూ విలనిజాన్ని పండించాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ఐకాన్ స్టార్‌‌ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’లో కనిపించేది కొద్దిసేపైనా గుర్తుండిపోయే పాత్ర చేశాడు. ‘పుష్ప2’లో హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

ఈ రోజు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ టీమ్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘పుష్ప ది రూల్’ నుంచి ఫహాద్ లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు.

‘‘భన్వర్ సింగ్ షెకావత్ సర్.. ప్రతీకారంతో వస్తున్నారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నిన్నటిదాకా ‘అప్‌డేట్ లేదా పుష్ప’ అంటూ అడిగిన అభిమానులు.. ఇప్పుడు ‘పార్టీ లేదా షెకావత్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పుప్ప 2 ది రూల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలి భాగానికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ మరోసారి మ్యాజిక్ చేయనున్నాడు. రెండో భాగంలో షెకావత్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, హీరోకు, ఆ పాత్రకు యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇటీవల చెప్పాడు ఫాజిల్. షెకావత్ పాత్రకు సంబంధించిన ఇప్పటికే ఫాజిల్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. ‘తగ్గేదే లే’ అంటూ రచ్చ చేసిన పుష్ప రెండో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Pushpa2
Fahadh Faasil
Allu arjun
pushpa2 the rule
Bhanwar Singh Shekhawat
Rashmika

More Telugu News