అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
- వచ్చే అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని కామెంట్
- సొంత వాళ్లు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారు..
- గతేడాది రాజా సింగ్ పై సస్పెన్షన్ విధించిన బీజేపీ
జంటనగరాల్లో రాజాసింగ్ కు బీజేపీ శ్రేణుల్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ.. గతేడాది మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు రాజాసింగ్ ను చిక్కుల్లో నెట్టాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్.. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శాసన సభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లిన రాజాసింగ్, బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ తాజాగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.