బెంగళూరులో తెలుగు కుటుంబం ఆత్మహత్యకు ఆర్థికసమస్యలే కారణమన్న పోలీసులు
- మచిలీపట్నానికి చెందిన టెకీ బెంగళూరులో ఆత్మహత్య
- అంతకుమునుపు భార్య, పిల్లలను గొంతు నులిమి హత్య
- షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన టెకీ
- ఆర్థికకష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు బెంగళూరు డీసీపీ వెల్లడి
విజయ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి డబ్బంతా పోగొట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడు తన భార్య, ఏడాదిన్నర, ఆరు నెలల వయసున్న ఇద్దరు కూతుళ్లను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బెంగళూరు డీసీపీ వెల్లడించారు. కుటుంబ సభ్యులను గొంతు నులిమి హత్య చేసినట్టు ఫోరెన్సిక్ నిపుణులు అంచనాకు వచ్చారని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో శనివారం మచిలీపట్నంలో వారి అంత్యక్రియలు జరిగాయి.