నేను, అన్నయ్య మా తమ్ముడి గురించి అమ్మకు ఇదే విషయం చెప్పాం: నాగబాబు
- మనం రాక్షసుడితో పోరాటం చేస్తున్నామన్న నాగబాబు
- సోషల్ మీడియా వేదికగా జనసేనకు మద్దతుగా ప్రచారం చేయాలని పిలుపు
- ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచన
ఏదైనా సాధించాలంటే యువతతోనే సాధ్యమవుతుందన్నారు. మనం ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నామని, కాబట్టి అందరూ కలిసి నడవాలన్నారు. గతంలో ఒక వ్యక్తి కోసం ఓటు వేశారని, తర్వాత తండ్రిని చూసి కొడుక్కి వేశారని, ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండని పిలుపునిచ్చారు. సినిమా రంగంలో చిరంజీవి, రాజకీయ రంగంలో పవన్ కల్యాణ్‌ను కోట్లాది మంది ఆరాధిస్తున్నారన్నారు. అలాంటి కొడుకులకు జన్మనిచ్చిన తల్లిగా నువ్వు గొప్ప అని తన తల్లిని ఉద్దేశించి అన్నారు. తమ తల్లితో తాను, అన్నయ్య చిరంజీవి తన తమ్ముడి గురించి ఇదే విషయం చెప్పామని తెలిపారు.