Stock Market: భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు

  • 481 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 135 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.25 శాతం పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఐటీ, ఫార్మా రంగాల సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 481 పాయింట్లు లాభపడి 65,721కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకుని 19,517కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:  
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.25%), టెక్ మహీంద్రా (2.91%), విప్రో (2.28%), భారతి ఎయిర్ టెల్ (2.02%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.72%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.94%), ఎన్టీపీసీ (-1.09%), మారుతి (-0.83%), టాటా మోటార్స్ (-0.69%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.59%).

More Telugu News