ఆప్కాబ్ సేవలు మరింతగా విస్తరిస్తున్నాయి: జగన్
- ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్
- బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన సీఎం
- సహకార వ్యవస్థను బలోపేతం చేసింది వైఎస్సార్ అని వ్యాఖ్య
ఆర్బీకేలను ఆప్కాబ్ తో అనుసంధానం చేశామని... ఇప్పుడు ఆర్బీకేల స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. ఆర్బీకేలు రైతుల చేతులు పట్టుకుని నడిపిస్తున్నాయని చెప్పారు. దేశ చరిత్రలోనే మన ఆప్కాబ్ కు మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఆప్కాబ్ సేవలు మరింతగా విస్తరిస్తున్నాయని.. రోబోయే రోజుల్లో మరిన్ని మార్పులను చూస్తామని చెప్పారు.