వైఎస్ భార్య విజయమ్మకు సభ్యత్వమే లేదు... ఇంతకంటే మోసం ఉంటుందా!: కన్నా
- వైఎస్ ఫోటో కావాలి.. కానీ విజయమ్మకు మాత్రం సభ్యత్వం ఇవ్వరా? అన్న కన్నా
- వైసీపీ ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ వంటిదని విమర్శ
- జగన్ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపణ
ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసీపీ, అన్ని వర్గాల గొంతు కోసిందన్నారు. అసలు వైసీపీనే మోసపూరిత ఆలోచనతో పుట్టిందన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్‌ది ఏ పార్టీ? జగన్‌ది ఏ పార్టీ? అని ప్రశ్నించారు.
వైఎస్ తమ్ముళ్లలో ఒకరు రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటే, అతను ఈ భూమి మీద కూడా ఉండకూడదనేది వారి మనస్తత్వమని ఆరోపించారు. జగన్ సీఎం అయిన నాలుగు నెలల్లోనే సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉంటుందని మొట్టమొదటిసారి తానే చెప్పానన్నారు. ఇప్పుడు అలాగే జరుగుతోందన్నారు.