దీపికా పదుకొణె అద్భుతమైన నటి.. నేను ఆమెకు అభిమానిని: ప్రభాస్

Im deepikas fan says pan india star prabhas
  • తన సహనటి దీపిక పదుకొణెపై ప్రభాస్ ప్రశంసల జల్లు
  • ఆమెతో కలిసి నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని వ్యాఖ్య
  • ‘కల్కి 2898 ఏడీ’ సెట్స్‌లో ఆమె అడుగుపెట్టగానే అక్కడి వారిలో ఉత్సాహం ఉరకలెత్తేదని వ్యాఖ్య
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సహనటి దీపికా పదుకొణెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక కలిసి ‘కల్కి 2898 ఏడీ’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. 

‘‘దీపిక పదుకొణె చాలా అందంగా ఉంటుంది. అద్భుతమైన నటి. ఇప్పటికే ఆమె ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఆమె ‘కల్కి’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అక్కడున్న వారందరిలోనూ ఉత్సాహం వస్తుంది. ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాణ్ణి. ఇప్పుడు కుదిరింది’’ అని ప్రభాస్ తన మనసులో మాటను బయటపెట్టారు. 

వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా తొలుత ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కింది. ఇటీవల అమెరికాలో జరిగిన శాండియాగో కామిక్ కాన్ వేడుకలో చిత్రం బృందం టీజర్‌తో పాటూ సినిమా పేరును కూడా రివీల్ చేసింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌లో ప్రభాస్ లుక్స్ అదిరిపోవడంతో అభిమానుల సంబరం అంబరాన్ని అంటింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Prabhas
Deepika Padukone
Kalki 2898 AD
Tollywood

More Telugu News