ప్రముఖ బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య

Bollywood art director commits suicide
బాలీవుడ్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం తన స్టూడియోలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి ఆయన స్టూడియోకు వెళ్లారు. స్టూడియోలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 'లగాన్', 'జోథా అక్బర్', 'దేవదాస్' వంటి పలు చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. హిందీ, మరాఠీ భాషల్లో పలువురు స్టార్ హీరోల సినిమాలకు పని చేసి ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన పని చేసిన ఎన్నో చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. వ్యక్తిగతంగా ఆయన నాలుగు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గానే కాకుండా రెండు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా పని చేశారు. నాలుగు సినిమాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Nitin Desai
Bollywood
Art Director

More Telugu News