Vishwak Sen: గోదారోళ్లం .. నవ్వుతూ నరాలు లాగేస్తాం: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

Gangs Of Godavari movie first glimpes released
షార్ట్స్‌లో చూడండి
విష్వక్సేన్ తాజా చిత్రానికి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. లిరిక్ రైటర్ కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ను బట్టే ఈ సినిమా గోదావరి నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమైపోతోంది. ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, గోదావరి కేంద్రంగా సాగే ఇసుక మాఫియా చుట్టూ ఈ కథ నడవనుందని తెలుస్తోంది. 

ఇసుక మాఫియా .. ఈ విషయంలో ముఠాల మధ్య గొడవలు ప్రధానంగా ఈ కథ కొనసాగుతుందని అనిపిస్తోంది. "అన్నా మేము గోదారోళ్లం .. మాట ఒకటే సాగదీస్తాం .. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం' అంటూ విష్వక్ చెప్పిన డైలాగ్ తో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. లవ్ .. యాక్షన్ .. సస్పెన్స్ ప్రధానంగా ఈ గ్లింప్స్ కనిపించింది. 

ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా మాత్రమే మాస్ గా కనిపించిన విష్వక్, ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నాడు. కథానాయికగా నేహా శెట్టి నటించిన ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ .. సాయికుమార్ .. గోపరాజు రమణ కనిపించారు. అంజలి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించింది. నాగవంశీ - సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.


Go Back to Shorts
Vishwak Sen
Neha Shetty
Anjali
Sai Kumar
Gangs of Godavari

More Telugu News