తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు
- ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు
- కంటి చూపునకు ప్రమాదం లేదంటున్న వైద్యులు
- ఈసారి కేసులు పెరుగుతున్నాయని వెల్లడి
కళ్ల కలక బాధితులకు వైద్యుల సూచనలు..
వైరస్ వల్ల వచ్చే ఫోలిక్యులర్ కళ్ల కలకతో కంటి చూపునకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ సీజన్ లో కళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. బయట నుంచి వచ్చాక గోరువెచ్చని నీటితో కళ్లు, ముఖం కడుక్కోవాలని సూచించారు. తీవ్రమైన కళ్ల కలక (ఎపిడమిక్ కెరటో కన్జంక్టివైటిస్) విషయంలో అప్రమత్తత అవసరమని డాక్టర్లు చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలంలో దృష్టి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కళ్ల కలక మరీ బాధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.
సాధారణ లక్షణాలు..
కళ్లు ఎరుపెక్కడం, దురద, కాంతిని చూడలేకపోవడం, జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలు కళ్ల కలక బాధితులలో కనిపిస్తాయని వైద్యులు చెప్పారు. ఇది అంటువ్యాధి అని, ఇంట్లో ఒకరికి సోకితే వెంటనే మిగతా వారికీ అంటుకుంటుందని హెచ్చరించారు. దురదగా ఉందని కళ్లు నలపడం, సొంత వైద్యం చేసుకోవడం చేయొద్దని, వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు.