పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో
- ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం
- ఇస్రోకు ఇది 90వ స్పేస్ మిషన్
- పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 58వ మిషన్
ప్రయోగం విజయవంతమయిన తర్వాత శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయోగం విజయవంతం అయిందని, రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించామని చెప్పారు. సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ మిషన్ అని చెప్పారు.