నెలకు రూ.5.5 లక్షలు..అలా 25 ఏళ్ల పాటు చెల్లింపులు..ఎన్నారైకి బంపర్ లాటరీ
- దుబాయ్ లాటరీలో విజేతగా నిలిచిన యూపీ వాసి మొహమ్మద్ ఆదిల్ ఖాన్
- తనకు ఇంతటి అదృష్టం పడుతుందని ఎన్నడూ ఊహించలేదని వ్యాఖ్య
- తాను లాటరీ గెలిచిన విషయాన్ని కుటుంబసభ్యులు కూడా నమ్మలేకపోయారన్న ఆదిల్
- తనపై రెండు కుటుంబాలు ఆధారపడ్డాయని, ఈ డబ్బు తనకు ఎంతో అవసరమని వెల్లడి
ప్రస్తుతం డబ్బు అవసరంలో ఉన్న తనను ఈ లాటరీ అన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని ఆదిల్ చెప్పాడు. లాటరీ గెలిచిన విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెబితే వారు మొదట నమ్మలేకపోయారని, మరోసారి అన్నీ సరిచూసుకోమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. కరోనా సమయంలో తన అన్న చనిపోయాడని ఆదిల్ చెప్పాడు. తనకు అయిదేళ్ల కూతురు ఉందని అన్నారు. ఇరు కుటుంబాలకు తనే ఆధారమని చెప్పుకొచ్చాడు. కాగా, విజేత మేలు దృష్ట్యా లాటరీలో గెలిచిన మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేందుకు నిర్ణయించామని లాటరీ నిర్వాహకులు తెలిపారు.