నందిని పాల ధర పెంపుపై డీకే శివకుమార్ వివరణ ఇదే
- లీటర్ నందిని పాల ధరను రూ. 3 చొప్పున పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
- పాడి రైతులకు మేలు చేసేందుకేనన్న డీకే శివకుమార్
- పాల ధర కర్ణాటకలోనే తక్కువగా ఉందని వ్యాఖ్య
దేశ వ్యాప్తంగా లీటర్ పాల ధర రూ. 50 నుంచి రూ. 56 వరకు ఉందని... కర్ణాటకలో మాత్రం తక్కువగా ఉందని... అందుకే లీటర్ ధరను రూ. 3 చొప్పున పెంచి రైతులకు సాయపడాలని నిర్ణయించామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిని వర్సెస్ అమూల్ అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కర్ణాటకకు చెందిన నందిని పాలను దెబ్బ తీసేందుకే అమూల్ పాలను తీసుకొచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.