మట్కా... కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే!
- కరుణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న వరుణ్ తేజ్
- నేడు పూజా కార్యక్రమాలు
- టైటిల్ అనౌన్స్ మెంట్ తో హైప్ లోకి వచ్చిన చిత్రం
- జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం
వైరా ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం... హైదరాబాద్ లో నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హీరో వరుణ్ తేజ్ సహా చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఓ సరికొత్త ప్రపంచానికి ప్రారంభం అంటూ దర్శకుడు కరుణ కుమార్ సోషల్ మీడియాలో టైటిల్ లుక్ ను పంచుకున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది.
ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి కథనాయిక కాగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు చిత్రబృందం నిన్ననే వెల్లడించింది. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ మట్కా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల ఈ సినిమాకు నిర్మాతలు.