సాయం కోసం మోరంచ గ్రామస్థుల ఆర్తనాదాలు.. బాధితుడు పంపిన వీడియో ఇదిగో!
- జల దిగ్బంధంలో మోరంచపల్లి గ్రామం
- ఇళ్ల పైకప్పుల మీదికి గ్రామస్థులు
- రక్షించాలంటూ అధికారులకు ఫోన్లు
- చెట్టు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు
తమను కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది. లారీ పెకి ఎక్కిన డ్రైవర్ సాయం కోసం వేడుకుంటున్నాడు. పక్కనే ఓ చెట్టు పైకెక్కి ఇద్దరు గ్రామస్థులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. గ్రామంలో పరిస్థితిపై ఓ వ్యక్తి వీడియో తీసి తమను కాపాడాలంటూ అధికారులకు పంపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.