Anil: సెన్సార్ పూర్తి చేసుకుని ఆగ‌స్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న 'రుద్రంకోట‌'

  • జయలలిత కీలక పాత్రలో 'రుద్రంకోట'
  • భద్రాచలం నేపథ్యంలో జరిగే కథ 
  • దర్శకుడిగా అనిల్ పరిచయం
  • వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు

Rudram Kota Movie Update

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`.  ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై  రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, U/A  స‌ర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఈ సంద‌ర్భంగా హీరో .. నిర్మాత అనిల్ మాట్లాడుతూ .. "శ్మ‌శాన వాటిక‌లో పెరిగిన ఓ యువ‌కుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర 'రుద్రంకోట' అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి" అని అన్నాడు. " సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత గారు ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ప్ర‌ముఖ  సంగీత ద‌ర్శ‌కులు కోటి గారు మా చిత్రానికి అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఆగ‌స్టు నెల‌లో  స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాము" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News