4కె క్వాలిటీలో ‘భైరవద్వీపం’ రీరిలీజ్‌.. ఎప్పుడంటే..!

  • ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌
  • బ్రహ్మరథం పడుతున్న అభిమానులు
  • ఆగస్టు 5న భైరవద్వీపం రీరిలీజ్‌
ఈ మధ్య టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. తమ అభిమాన హీరో, డైరెక్టర్ల పుట్టిన రోజులను పురస్కరించుకొని వారి సూపర్‌‌ హిట్ సినిమాలను తిరిగి విడుదల చేస్తుండగా.. ఫ్యాన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. వాటికి మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అలా ఖుషీ, సింహాద్రి, ఒక్కడు వంటి చిత్రాలు రీ రిలీజ్‌లోనూ సందడి చేశాయి. బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ సినిమాను ఈ మధ్య రిలీజ్ చేయగా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు బాలకృష్ణ నటించిన ఫాంటసీ క్లాసిక్ ‘భైరవద్వీపం’ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు.

 దీన్ని 4కె క్వాలిటీతో ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్టు క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ అనే సంస్థ వెల్లడించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌‌లో మైలురాయిగా నిలిలిచింది. ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రభంజనం సృష్టించి, 9 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. రోజా కథానాయికగా నటించిన ఈ సినిమాకు రావి కొండలరావు కథను అందించారు. మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. టీవీల్లోనూ ఈ సినిమా కొన్నేళ్ల పాటు సందడి చేసింది.

Balakrishna
August 5
BhairavaDweepam
4K
Re Releasing

More Telugu News