Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మణిపూర్ మహిళపై బీఎస్ఎఫ్ జవాను లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాలో రికార్డయిన దారుణం

BSF Jawan sexually assaulted Manipur woman
Advertisement
  • మణిపూర్ లో వరుసగా వెలుగు చూస్తున్న దారుణాలు
  • స్టోర్ లో ఉన్న మహిళలపై బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
  • విధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Advertisement
మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జాతుల మధ్య వైరంతో అక్కడి మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరిగాయి. వారిని కాపాడాల్సిన జవాన్లు కూడా లైంగిక దాడులకు పాల్పడటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. ఒక స్టోర్ లో ఓ మహిళపై బీఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

 ఇంఫాల్ లో ఈ నెల 20న ఈ ఘటన చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ సతీశ్ ప్రసాద్ గా గుర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో ఆయన యూనిఫామ్ లోనే ఉన్నాడు. అంతేకాదు, ఆయన వద్ద ఇన్సాస్ రైఫిల్ కూడా ఉంది. ఈ ఘటన నేపథ్యంలో సతీశ్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. సతీశ్ పై డిపార్ట్ మెంటల్ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement
Manipur
BSF Jawan
Woman
Sexual assault

More Telugu News