TJR SUdhakar Babu: ఆ డబ్బంతా ఏం చేశావని నా భార్య అడుగుతోంది.. ఆమెకేం చెప్పాలి?: లోకేశ్‌ను ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

YSRCP MLA TJR SUdhakar Babu slams Nara Lokesh
షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లో తాను అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు సంపాదించానని లోకేశ్ చేసిన ఆరోపణలను టీవీలో చూసిన తన భార్య.. ఆ డబ్బంతా ఏం చేశావని ప్రశ్నిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. ఇప్పుడు ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ ఆరోపణలతో తమ ఇంట్లో సమస్యలు వస్తున్నాయన్నారు. లోకేశ్ తాను చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తగదని లోకేశ్‌కు హితవు పలికారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని అన్నారు. టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే గ్రానైట్ పరిశ్రమకు మేలు జరిగిందని అన్నారు.
Go Back to Shorts
TJR SUdhakar Babu
YSRCP
Nara Lokesh
TDP

More Telugu News