Pavan Kalyan: 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంటులో మెరిసిన ముగ్గురు భామలు!
పవన్ కల్యాణ్ - సాయితేజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'బ్రో' ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - 'శిల్పకళావేదిక'లో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన ప్రియా ప్రకాశ్ వారియర్ .. కేతిక శర్మతో పాటు, ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా కూడా ఈ వేదికపై అందంగా మెరిసింది. కేతిక మాట్లాడుతూ .. ఇది పవర్ స్టార్ సినిమా కావడం వలన, ఈ ఈవెంట్ ఒక పవర్ హౌస్ లా కనిపిస్తోంది. ఇలాంటి ఒక ప్రాజెక్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సముద్రఖని గారికి థ్యాంక్స్ అని చెప్పింది. ఇక్కడి సందడి చూస్తుంటే తనకి మాటలు రావడం లేదనీ, పవన్ సినిమాలో చేయడం తన అదృష్టమని ప్రియా ప్రకాశ్ వారియర్ అంది. ఇక ఈ సినిమాలో నటించిన సాయితేజ్ తో పాటు, వరుణ్ తేజ్ .. వైష్ణవ్ తేజ్ కూడా ఈ ఫంక్షన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక చాలా రోజుల తరువాత బ్రహ్మానందం కూడా ఈవెంటులో సందడిగా కనిపించారు. శివమణి డ్రమ్స్ .. రేవంత్ పాడిన టైటిల్ సాంగ్ ఈ ఈవెంటుకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.