జోగి రమేశ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టిన జనసేన వీర మహిళలు

Janasena Veera Mahila hits Jogi Ramesh effigy with chappals
  • నిన్న పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోగి రమేశ్
  • మార్చడం, తార్చడం పవన్ కు అలవాటేనన్న జోగి
  • దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన శ్రేణుల యత్నం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్చడం, తార్చడం వంటివి పవన్ కు అలవాటేనని ఆయన అన్నారు. పెళ్లాలనే కాకుండా పార్టీలను కూడా మారుస్తుంటారని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. 

మరోవైపు జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు, జనసేన వీరమహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పిచ్చికుక్క జోగి రమేశ్ అంటూ ఆయన దిష్టిబొమ్మను వీరమహిళలు చెప్పుతో కొట్టారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను లాక్కెళ్లారు. అమ్మిశెట్టి వాసును అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Jogi Ramesh
YSRCP
Janasena
Pawan Kalyan

More Telugu News