‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పేరులోనూ ఇండియా ఉంది.. విపక్ష కూటమిపై మోదీ ఫైర్
- ఉగ్ర సంస్థల పేర్లలోనూ ఇండియా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు
- పేరు మారినంత మాత్రాన వాటి తీరు మారుతుందా అంటూ ప్రశ్న
- బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ
మంగళవారం ఉదయం పార్లమెంటు లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు ప్రధాని మోదీ రాగానే పార్టీ నేతలంతా లేచి చప్పట్లతో స్వాగతించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. విపక్షాల కూటమిపై విమర్శలు గుప్పించారు. పేరు మార్చుకుని ఇండియా అని పెట్టుకున్నంత మాత్రానా వాటి తీరు మారుతుందని అనుకోలేమని చెప్పారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని మోదీ గుర్తుచేశారు. కాగా.. ఈ సమావేశంలో మణిపూర్ హింస నేపథ్యంలో విపక్షాల ఆందోళన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.