చంద్రముఖి-2లోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడిపితే... ఆ సీన్లకు జీవం పోసేందుకు నేను నిద్రలేని రాత్రులు గడిపాను: కీరవాణి
- రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా చంద్రముఖి-2
- పి.వాసు దర్శకత్వంలో చిత్రం
- సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి
- సినిమా ఎలా ఉంటుందో చూఛాయగా చెప్పిన పెద్దన్న
"లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కి చంద్రముఖి-2 చిత్రం చూశాను. ఈ సినిమాలోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. కానీ ఆ సినిమాలోని సీన్లకు జీవం పోసేందుకు నేను రెండు నెలల పాటు రేయింబవళ్లు నిద్రలేకుండా గడిపాను. ఆ సీన్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ సీన్లకు ప్రాణం పోసేందుకు నా వంతు కృషి చేశాను" అని కీరవాణి తన ట్వీట్ లో వివరించారు.
అంతేకాదు, గురుకిరణ్, తన మిత్రుడు విద్యాసాగర్ ఈ సందర్భంగా తనకు ఆశీస్సులు అందించాలని కూడా కీరవాణి కోరారు.
అప్పట్లో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించగా... కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా ఆప్తమిత్ర పేరుతో తెరకెక్కిన ఈ హారర్ చిత్రానికి గురుకిరణ్ సంగీతం సమకూర్చారు. అందుకే వారిద్దరి పేర్లను కీరవాణి తాజాగా ప్రస్తావించారు.