Amit Shah: మంత్రాలయంలో 108 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణం... వర్చువల్ గా శంకుస్థాపన చేసిన అమిత్ షా

Amit Shah virtually laid foundation stone for Lord Rama statue in Mantralayam
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 108 అడుగుల భారీ ఎత్తున శ్రీరాముడి విగ్రహం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ నిర్మాణ ప్రారంభోత్సవం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. 

కాగా, ఈ భారీ శ్రీరాముడి విగ్రహాన్ని మంత్రాలయం శివారు ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఈ పంచలోహ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణకర్త, ప్రముఖ శిల్పి రామ్ వాంజీ సుతార్ మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. కాగా, ఈ విగ్రహం ముందు భాగంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రామాలయం ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.
Go Back to Shorts
Amit Shah
Lord Rama Statue
Mantralayam
Foundation Stone
BJP
Andhra Pradesh
India

More Telugu News