తిరుమల వెంకన్న ఆస్తుల వివరాలు ఇవిగో!
- వారణాసిలో అంతర్జాతీయ ఆలయాల సమావేశం
- హాజరైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
- శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు
- బ్యాంకులో 11 టన్నుల బంగారం
- టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం
ఈవో ధర్మారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం....
- తిరుమల వెంకటేశ్వరస్వామి వారి పేరిట బ్యాంకులో రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి.
- బ్యాంకులో 11 టన్నుల బంగారం డిపాజిట్లు ఉన్నాయి.
- శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాల బరువు 1.2 టన్నులు.
- వెండి ఆభరణాల బరువు 10 టన్నులు.
- టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది.
- టీటీడీలో 24,500 మంది ఉద్యోగులు ఉన్నారు.
- శ్రీవారి సన్నిధిలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగుల సంఖ్య 800.
- స్వామివారికి ప్రతి ఏడాది 500 టన్నుల పుష్పాలతో అలంకరణ.
- ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం ప్రతి సంవత్సరం 500 టన్నుల నెయ్యి వినియోగం.
- టీటీడీ కింద దేశవ్యాప్తంగా 71 ఆలయాలు.