నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద
- ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,988 క్యూసెక్కులు
- నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
- ప్రస్తుతం 517 అడుగులకు చేరిన నీటిమట్టం
రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ సంస్థ పేర్కొన్న నేపథ్యంలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశమున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.