చెల్లిని చంపి..ఆమె తలతో పోలీసుల ముందు లొంగిపోయిన అన్న

UP Man Beheads Sister Walks To Police Station With Severed Head
  • ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లా మిత్వారా గ్రామంలో వెలుగుచూసిన ఘటన
  • చెల్లి ప్రేమవ్యవహారంపై అన్న అభ్యంతరం, 
  • ఇద్దరి మధ్యా తరచూ వాగ్వాదం, ఇంతలో దారుణం
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చెల్లి ప్రేమ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు ఆమె తలనరికి చంపేశాడు. ఆమె తల తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారాబంకీ జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

మిత్వారా గ్రామానికి చెందిన ఆషిఫా(18) స్థానికంగా నివసించే యువకుడితో ప్రేమలో పడి ఇంట్లో నుంచి వెళ్లపోయింది. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలిక ఆచూకీ కనుక్కుని ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇటీవల ఈ విషయమై ఆషిఫాకు ఆమె అన్న రియాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. 

దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన రియాజ్ పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే బయలుదేరిన పోలీసులు నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా దారిలోనే అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారం విషయంలో అన్నా చెల్లి మధ్య తరచూ ఘర్షణ జరుగుతుండేదని స్థానికులు తెలిపారు.
Go Back to Shorts
Uttar Pradesh
Crime News

More Telugu News