విమానంలో ఉర్ఫీ జావెద్‌కు వేధింపులు
- ముంబై నుంచి గోవా వెళ్తుండగా ఘటన
- మద్యం మత్తులో టీజ్ చేసిన ప్రయాణికుడు
- తాను పబ్లిక్ ఫిగర్‌నే కానీ ప్రాపర్టీని కాదంటూ ఉర్ఫీ ఆగ్రహం
తనను కొందరు ఈవ్ టీజింగ్ చేశారని వాపోయింది. ముంబై నుంచి గోవా వెళ్తుండగా తాను వేధింపులు ఎదుర్కొన్నట్టు చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈవ్ టీజింగ్ చేస్తూ, పేర్లు పెట్టి పిలుస్తూ వేధించారని పేర్కొంది. తాను వారితో వాదులాటకు దిగడంతో తన స్నేహితుడు మద్యం తాగి ఉన్నాడని చెప్పారని తెలిపింది. తాగి ఉన్నా సరే మహిళలతో ఇలా అసభ్యంగా ప్రవర్తించడాన్ని క్షమించలేమని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను పబ్లిక్ ఫిగర్‌నే అయినా పబ్లిక్ ప్రాపర్టీని మాత్రం కాదని తెగేసి చెప్పింది.
తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఉర్ఫీ జావెద్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారింది. గురువారం కూడా పింక్ డ్రెస్ ధరించి న్యూలుక్లో ఫొటోలకు పోజిచ్చింది. కాగా, ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై నిత్యం వివాదాలు రాజుకుంటూనే ఉంటాయి.