KTR: ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశాం: కేటీఆర్

  • యంగ్ స్టేట్-సవాళ్లు అనే అంశంపై కేటీఆర్ ప్రసంగం
  • తెలంగాణ కోసం దశాబ్దాల తరబడి పోరాటం సాగిందని వెల్లడి
  • కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామని స్పష్టీకరణ
KTR speech on Young State and Challenges

యంగ్ స్టేట్-సవాళ్లు అనే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. దశాబ్దాల పోరాటం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.  

1950 నుంచి 2014 వరకు దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని వివరించారు. తెలంగాణను సాకారం చేసుకునేందుకు ఎందరో ఆత్మ బలిదానాలు చేశారని కేటీఆర్ చెప్పారు. 

ఓ రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ గొప్పగా ఎదుగుతోందని, ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని అన్నారు. హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఆర్థికంగా స్థిరపడుతున్నారని, ఇళ్లను కొనేస్తున్నారని గర్వంగా చెప్పారు. తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.2.14 లక్షల కోట్లు అని కేటీఆర్ వెల్లడించారు. 

రాష్ట్రంలో అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.

More Telugu News