Anitha: జగన్ పాలనలో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సంతోషంగా ఉన్నారు: వంగలపూడి అనిత

Anitha fires on Jagan
షార్ట్స్‌లో చూడండి
 గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి ఓట్లు వేయించుకున్న జగన్ మహిళా ద్రోహి అని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళలంతా ఎంతో బాధలో ఉన్నారని... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సంతోషంగా ఉన్నారని చెప్పారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా పదవిలోనే ఉన్నాననే భ్రమలో ఉన్న వాసిరెడ్డి పద్మ కూడా సంతోషంగానే ఉన్నారని అన్నారు. 

ఏపీలోని మహిళలు మణిపూర్ లోని మహిళల కంటే దారుణమైన స్థితిలో ఉన్నారని అనిత అన్నారు. ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న బాధల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే... పవన్ భార్యల గురించి జగన్ మాట్లాడతారని దుయ్యబట్టారు. పిల్లలను తల్లులు పెంచే తీరు సరిగా లేదని ఒక మంత్రి... ఒకటి, రెండు అత్యాచారాలకే ఇంత రాధ్దాంతమా అని మహిళా మంత్రులు మాట్లాడుతుండటం దారుణమని అన్నారు.పోలీస్ స్టేషన్లకు వెళ్లినా న్యాయం జరగడం లేదని విమర్శించారు. 

Go Back to Shorts
Anitha
Telugudesam
Jagan
YSRCP

More Telugu News