బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన
- వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం
- పశ్చిమ వాయవ్య దిశగా పయనం
- స్థిరంగా కొనసాగుతున్న రుతుపవన ద్రోణి
- ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
- తెలంగాణలో నేడు అత్యంత భారీ వర్షం
- తెలంగాణలో ఈ నెల 21 నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ క్రమంలో, ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. రాగల 5 రోజుల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఇక, తెలంగాణలో నేడు అత్యంత భారీ వర్షం కురుస్తుందని, ఈ నెల 21 నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.