జగన్ సైకో రెడ్డి అని నేను ముందు నుంచీ చెపుతూనే ఉన్నా: కన్నా లక్ష్మీనారాయణ
- పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకురావడం లేదన్న కన్నా
- జులై 20 వచ్చినా కాలువలకు మరమ్మతులు చేయించలేదని విమర్శ
- ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని మండిపాటు
జులై 20వ తేదీ వచ్చినా కాలువలకు మరమ్మతులు చేయించలేదని... చాలా చోట్ల రైతులే చందాలు వేసుకుని మరమ్మతులు చేయించుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉందని... పోలీసు ఉన్నతాధికారులు ఇంతలా దిగజారడం గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.