తండ్రికి తగ్గ కూతురు.. గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌బాబు తనయ సితార

  • తన 11వ పుట్టినరోజు సందర్భంగా సైకిళ్లు పంపిణీ చేసిన సితార

  • పేదింటి విద్యార్థుల సమక్షంలో వేడుకలు

  • సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార.. తండ్రికి తగ్గ కూతురు. అందంలోనూ.. అభినయంలోనూ.. దాతృత్వంలోనూ మహేశ్‌బాబుకు ఏం మాత్రం తీసిపోదు. ఈ రోజు తన 11వ పుట్టినరోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకుంది.


తన బర్త్ డే సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది సితార. విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించి.. వారితో సరదాగా మాట్లాడింది. తర్వాత ఆ విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. సైకిళ్లను అందజేసి వారితో ఫొటోలు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తోందంటూ పలువురు నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. 

 

మహేశ్‌బాబు తన చిన్నతనంలోనే వెండితెరకు పరిచయమైనట్లే.. సితార ఇప్పుడు ఓ ప్రముఖ నగల దుకాణం వాణిజ్య ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే. ఏకంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో సితార యాడ్ ఫోటోలను ప్రదర్శించారు. 


ఇక మహేశ్‌ బాబు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తుండగా... సితార తనకు వచ్చిన పారితోషికాన్ని ఛారిటీకి వాడినట్లు ఇటీవల చెప్పింది. తనకు సినిమాల్లోకి రావాలని ఉందని చెప్పిన సితార.. ప్రస్తుతం డ్యాన్స్‌ లో శిక్షణ తీసుకుంటోంది.


Sitara Ghattamaneni
MaheshBabu
sitara birth day
bicycles to girls

More Telugu News