భద్రాచలం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
- ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరదనీరు
- భద్రాచలం వద్ద 28.9 అడుగులకు చేరిన నీటి మట్టం
- లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
నీటి మట్టం పెరుగుతుండటంతో భద్రాచలంలోని స్నాన ఘట్టాలు చాలామటుకు మునిగిపోయాయి. శ్రీరాముడి దర్శనానికి వచ్చిన భక్తులు స్నానం చేసేటప్పుడు ఎక్కువ లోతుకు వెళ్లవద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.