బెంగళూరులో ఉగ్రదాడుల కుట్ర భగ్నం
- ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు
- వారి నుంచి పేలుడు పదార్థాల స్వాదీనం
- మరో ఐదుగురు అనుమానితులపై నిఘా
ఉగ్ర దాడుల ప్రణాళికలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో ఐదుగురి కోసం సీసీబీ నిఘా పెట్టింది. ఇక అరెస్టయిన ఐదుగురు నిందితులకు 2017లో జరిగిన ఓ హత్యకేసులో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఆ హత్య కేసులో బెంగుళూరు సెంట్రల్ జైలుకి వెళ్లిన ఐదుగురికి అక్కడ కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఉగ్రదాడులకు శిక్షణ పొందారని వెల్లడించారు. నగరంలో ఉగ్ర దాడులకు సంబంధించిన ప్లాన్‌పై సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు.