Vijay Antony: జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవలసిందే: 'హత్య' ట్రైలర్ డైలాగ్

  • విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన 'హత్య'
  • ఒక మోడల్ హత్య చుట్టూ తిరిగే కథ 
  • ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
Hathya Movie Trailer Released

విజయ్ ఆంటోని హీరోగా తన కెరియర్ మొదలైన దగ్గర నుంచి, విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'బిచ్చగాడు 2' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన చేసిన సినిమానే 'హత్య'. టైటిల్ తోను .. ఫస్టులుక్ పోస్టర్ తోను ఆయన ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు. 

బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన డిటెక్టివ్ గా కనిపించనున్నాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం, ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవలసిందే' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. 

లైలా అనే ఒక మోడల్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుందనీ .. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. రితిక సింగ్ - మీనాక్షి చౌదరి కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమాలో, మురళీశర్మ .. రాధిక శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

  • Loading...

More Telugu News