ఇక I-N-D-I-A వర్సెస్ ఎన్డీయే: రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ
- ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదన్న రాహుల్
- ప్రజల స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమని వ్యాఖ్య
- I-N-D-I-A గెలిచి... బీజేపీ ఓడిపోతుందని మమత జోస్యం
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, I-N-D-I-A మధ్య పోరు ఉంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మా I-N-D-I-Aను ఎన్డీయే ఛాలెంజ్ చేస్తుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో I-N-D-I-A గెలుస్తుందని, బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. విపక్ష నేతల పైకి బీజేపీ సీబీఐ, ఈడీని ప్రయోగిస్తోందని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రతి వ్యవస్థను నాశనం చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. రైల్వే వ్యవస్థను కూడా నాశనం చేశారన్నారు.