Congress: విపక్షాల ఫ్రంట్ పేరు.. I-N-D-I-A, అంటే అర్థం ఇదే...!

INDIA Name Being Considered For United Opposition
షార్ట్స్‌లో చూడండి
2024 లోక్ సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించేందుకు, వ్యూహాలు రచించేందుకు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో విపక్షాలు రెండో రోజైన మంగళవారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ సహా ఆయా పార్టీలు పదకొండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. విపక్ష పార్టీల ఐక్య కూటమికి పేరు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీల ఫ్రంట్‌కు I-N-D-I-A అనే పేరును ప్రతిపాదించగా, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (I-N-D-I-A) అనే పేరు దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ఫ్రంట్ నేతలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

నిన్న జరిగిన విందు సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్రంట్‌కు పేరు సూచించాలని సూచించారు. ఈ రోజు ఆ పేర్లను పరిశీలించి, చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా I-N-D-I-A పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శరద్ పవార్ నిన్నటి భేటీకి హాజరు కాలేదు. కానీ ఈ రోజు మాత్రం హాజరయ్యారు.
Go Back to Shorts
Congress
Rahul Gandhi
Mallikarjun Kharge
Bengaluru
Nitish Kumar
Sharad Pawar
Arvind Kejriwal

More Telugu News