ఖర్చుకు జడిసి.. కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు గుడ్‌బై చెప్పేసిన ‘విక్టోరియా’
- 2026లో కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన విక్టోరియా ప్రభుత్వం
- 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన ప్రభుత్వం
- 12 రోజుల కోసం అంత డబ్బంటే చాలా ఎక్కువన్న విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్
- తమకు ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలకంటే ఖర్చే ఎక్కువన్న ఆండ్రూస్
విక్టోరియా ప్రాంతంలో హౌసింగ్, పర్యాటకం, క్రీడా మౌలిక సదుపాయాల వంటి ప్రయోజనాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే గేమ్స్ నిర్వహణకు ముందుకొచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. 12 రోజుల గేమ్స్ కోసం 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం చాలా ఎక్కువని, ఆతిథ్యం నుంచి వెనక్కి తగ్గడానికి అదే ప్రధాన కారణమని విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. క్రీడల ద్వారా తమ రాష్ట్రానికి వస్తాయనుకున్న ఆర్థిక ప్రయోజనాలకు ఇది రెండు రెట్ల కంటే ఎక్కువని పేర్కొన్నారు. గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం కంటే విక్టోరియా ప్రాంత అభివృద్ధికి 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రభుత్వం అందిస్తుందని ఆయన వివరించారు.